తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీదీకి మోదీ శుభాకాంక్షలు- గవర్నర్ సెటైర్లు - మమతా బెనర్జీ

బంగాల్​ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అందిరికీ ఉచిత వ్యాక్సిన్లు, రెమ్​డెసివిర్​ వంటి ఔషధాలు అందుబాటులో ఉంచాలని కోరుతూ మోదీకి దీదీ లేఖ రాశారు. మరోవైపు మమతతో ప్రమాణస్వీకారం చేయించిన బంగాల్ గవర్నర్ జగ్​దీప్ ధన్​ఖర్​.. రాష్ట్రంలో చెలరేగిన హింసను తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోవాలని వేదికపైనే కీలక వ్యాఖ్యలు చేశారు.​

Mamata takes oath as CM
సీఎంగా దీదీ ప్రమాణ స్వీకారం

By

Published : May 5, 2021, 4:32 PM IST

తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ.. బంగాల్ సీఎంగా వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జగ్​దీప్ ధన్​ఖర్​​.. మమతతో ప్రమాణం చేయించారు. కొవిడ్ నేపథ్యంలో అతి తక్కువ మంది సమక్షంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది.

బంగాల్​ ముఖ్యమంత్రిగా భాద్యతలు చెపట్టిన 8వ నేత మమత. మొత్తంగా ఆ రాష్ట్రానికి 21వ సీఎం.

మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

కరోనాను కట్టడి చేయడమే తన తొలి ప్రాధాన్యమని బాధ్యతలు స్వీకరించిన అనంతరం మమత స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం రెండో ప్రాధాన్యమన్నారు. బంగాల్​లో హింసాత్మక ఘటనలను నిరసిస్తూ మమత ప్రమాణ స్వీకారం చేసిన రోజే భాజపా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేసింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

వేదికపైనే సెటైర్లు..

మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం మమతను ఉద్దేశించి గవర్నర్​ కీలక వ్యాఖ్యలు వేశారు. ముందు బంగాల్​లో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసను ఆపేలా సీఎం చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు.

మోదీ శుభాకాంక్షలు..

మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

బంగాల్​ సీఎంగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

దీదీ లేఖ..

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని మోదీకి మమత లేఖ రాశారు. ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందించాలని, ఈ కార్యక్రమం పారదర్శకంగా సాగాలన్నారు. రెమ్​డెసివిర్ సహా ఇతర కీలక ఔషధాలను అవసరాలకు సరిపడా సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. బంగాల్​లో ఆక్సిజన్​ కొరతతో రోగులు మృతిచెందడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.

18ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇచ్చేందుకు సరిపడా వ్యాక్సిన్లు లేవని, ఈ సమస్యను తీర్చాల్సిన అవసరం ఉందని కూడా లేఖలో మమత ప్రస్తావించారు.

మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

కరోనా కట్టడికి చర్యలు..

బాధ్యతలు చేపట్టిన వెంటనే బంగాల్​లో కరోనా కట్టడికి మమత చర్యలు చేపట్టారు. అన్ని మార్కెట్లు, దుకాణాలు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7గంటల వరకే తెరిచి ఉంచాలని ఆదేశించారు. లోకల్​ రైళ్లను గురువారం నుంచి నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ, మెట్రోలో 50 శాతం ప్రయాణికులే ఉండాలన్నారు. మాస్కు ధరించడం తప్పనిసరి చేశారు. ప్రభుత్వ కార్యలయాల్లో 50 శాతం సిబ్బందితో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.

బంగాల్​ అంటే ఐక్యత..

బంగాల్​లో ఎన్నికల ఫలితాల అనంతరం చేలరేగిన హింసపై దీదీ స్పందించారు. అలాంటి ఘటనలను సహించేది లేదని తేల్చి చెప్పారు. భాజపా గెలిచిన ప్రాంతాల్లోనే ఎక్కువ అల్లర్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ పార్టీ పాత వీడియోలను ఉపయోగించుకుని తప్పుడు ఘటనలను చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనూ ఇలానే జరిగిందన్నారు. అన్ని పార్టీలు వెంటనే ఇలాంటి పనులకు ఆపాలన్నారు. బంగాల్ ఐక్యతకు నిదర్శని చెప్పారు.

9న మంత్రిమండలి

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 9న మమత తన కేబినెట్​ను విస్తరించే అవకాశాలున్నాయని టీఎంసీ వర్గాలు తెలిపాయి.​

ఇదీ చూడండి:ప్రభుత్వ ఏర్పాటుకు స్టాలిన్​ను ఆహ్వానించిన గవర్నర్

ABOUT THE AUTHOR

...view details