ప్రఖ్యాత హిందీ రచయిత, సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ దిల్లీలో మరణించారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. కోహ్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పౌరాణిక, చారిత్రక పాత్రలను తన రచనల్లో కోహ్లీ సజీవంగా చిత్రీకరించారని మోదీ తెలిపారు. హిందీ సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పారు.
''ప్రసిద్ధ సాహిత్యవేత్త నరేంద్ర కోహ్లీ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. పౌరాణిక, చారిత్రక పాత్రలను సజీవంగా చిత్రీకరించిన ఆయనను సాహిత్య రంగం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.''
-ట్వీట్టర్లో మోదీ