ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm Modi News) 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలువురు భాజపా నేతలు అభినందనలు తెలిపారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసిన ఇదే రోజున సుపరిపాలన, అభివృద్ధి ప్రారంభమయ్యాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah News) పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అవి నిరాటంకంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజల కోసం, దేశ ప్రగతి కోసం ప్రధాని మోదీ(Pm Modi News) రాత్రింబవళ్లు శ్రమించారని కొనియాడారు.
'పేదలకు అండగా..'
'ప్రధాన సేవక్'గా మోదీ.. భారత్‌ను అంతర్జాతీయ శక్తిగా మలిచారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. నిరాశ వాతావరణం నుంచి భారత్‌ను ప్రగతి పథంలో పెట్టి, 'విశ్వగురు'గా నిలిపారని చెప్పారు. "జన్‌ధన్ యోజనా, ఉజ్జ్వల్ యోజనా, కిసాన్ సమ్మాన్ నిధి యోజనా వంటి ఎన్నో పథకాలను మోదీ ప్రారంభించారు. వీటి ద్వారా పేదలకు అండగా నిలిచారు. మరెన్నో పథకాల ద్వారా మధ్యవర్తి పాత్రను తొలగించారు. అవినీతిని అంతమొందించారు. కర్మయోగిలా శ్రమంచారు"అని నడ్డా తెలిపారు.