తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుపానుతో కేంద్రం హైఅలర్ట్- మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

ఉత్తర ఆంధ్రా, ఒడిశా మధ్య తుపాను తీరం దాటే అవకాశమున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అధికారుల భేటీ జరిగింది. ఆయా ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులపై అధికారులు మోదీకి వివరించారు.

Pm modi cyclone meeting
తుపాను పరిస్థితులపై మోదీ సమావేశం

By

Published : Dec 2, 2021, 2:15 PM IST

దేశంలో తుపాను పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం అధికారులు సమావేశమయ్యారు. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశమున్న తరుణంలో.. ఉత్తర ఆంధ్రా, ఒడిశా తీరప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులను అధికారులు మోదీకి వివరించారు.

ప్రధాని మోదీ
అధికారులతో మోదీ చర్చలు

ఈ నెల 4న.. ఒడిశాలో తుపాను తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం.. అన్ని ఏర్పాట్లు చేయాలని 13 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

సమావేశంలో ప్రధాని మోదీ

ఇదీ చూడండి:-'అధికారం కాదు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details