తెలంగాణ

telangana

కేంద్ర మంత్రులతో మోదీ భేటీ- ఆ శాఖల పనితీరుపై ఆరా!

By

Published : Sep 28, 2021, 10:57 PM IST

కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భేటీ అయ్యారు. ఆయా శాఖలు అమలు చేస్తున్న పథకాల గురించి ఆరా తీశారు. (Modi meeting news) ఇద్దరు కేంద్ర మంత్రులు తమ శాఖలకు సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. (PM Council of ministers)

PM COUNCIL
మోదీ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కేంద్ర మంత్రిమండలితో భేటీ అయ్యారు. (Modi meeting news) వివిధ శాఖలు అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. (PM Council of ministers) ప్రస్తుతం జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులు మోదీకి వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat), పీయూష్ గోయల్​ (Piyush Goyal).. తమ శాఖలకు సంబంధించి మోదీకి ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

జులై 7న కేంద్ర కేబినెట్ విస్తరణ (Cabinet reshuffle Modi 2021) జరిగిన తర్వాత ఇలాంటి సమావేశం ప్రధాని నిర్వహించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. సెప్టెంబర్ 14న చివరిసారిగా సమావేశం జరిగింది. ఆ సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. తమ శాఖల పనితీరుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎంత సమర్థంగా, సమయానుగుణంగా పనిచేస్తున్నారనే విషయంపై మోదీకి వివరాలు తెలియజేశారు.

సెప్టెంబర్ 14న జరిగిన సమావేశాన్ని అధికారులు చాలా కీలకమైనదిగా అభివర్ణించారు. ఈ భేటీలో అనేక అంశాలపై మోదీ అధికారులతో కలిసి మేధోమధనం చేశారని చెప్పారు. పాలనను మెరుగుపర్చేందుకు ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:'సిద్ధూ వెంటే మేము'.. పంజాబ్ మంత్రుల వరుస రాజీనామాలు!

ABOUT THE AUTHOR

...view details