తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో మోదీ సమీక్ష - PM Modi meeting to review the Covid

దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్న వేళ.. ఉన్నతాధికారులతో ప్రధాని సమావేశమయ్యారు. మహమ్మారి కట్టడి, ఆక్సిజన్ సరఫరా సహా వైరస్​పై అవగాహన కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ అంశాలపై ఏర్పాటు చేసిన సాధికారత కమిటీ సభ్యులు.. సంబంధిత వివరాలను మోదీకి తెలియజేశారు.

Medical oxygen production being ramped up: Officials inform PM
కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో మోదీ సమీక్ష

By

Published : Apr 27, 2021, 10:56 PM IST

దేశంలో కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన సాధికారత కమిటీ అధికారులతో భేటీ అయ్యారు. ఆక్సిజన్ సరఫరా పెంచేందుకు తీసుకున్న చర్యల గురించి ప్రధానికి అధికారులు వివరించారు.

దేశంలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంఓ) ఉత్పత్తి రోజుకు 5,700 మెట్రిక్ టన్నుల(2020 ఆగస్టులో) నుంచి 8,922 మెట్రిక్ టన్నులకు(2021 ఏప్రిల్ 21 నాటికి) పెరిగిందని అధికారులు మోదీకి వివరించారు. దేశీయ ఎల్ఎంఓ ఉత్పత్తి ఏప్రిల్ చివరినాటికి 9,250 మెట్రిక్ టన్నులకు చేరనుందని అధికారులు పేర్కొన్నట్టు ప్రధాని కార్యాలయం(పీఎంఓ) తెలిపింది.

"వైద్య మౌలిక సదుపాయాలు, కరోనా నిర్వహణపై ఏర్పాటైన సాధికారత బృందం.. దేశంలో పడకల సంఖ్య పెంపుపై తీసుకున్న చర్యలను ప్రధానికి వివరించారు. కరోనా నియంత్రణ కోసం ఉన్న మార్గదర్శకాలు, వ్యూహాలను సరిగ్గా అమలు చేయాలని ప్రధాని వారికి స్పష్టం చేశారు."

-పీఎంఓ

కరోనాపై అవగాహన కోసం తీసుకుంటున్న చర్యలపై సమాచార సాధికారత కమిటీ అధికారులు ప్రధానికి వివరించారని పీఎంఓ తెలిపింది. ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్​ల పనితీరు, ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేసేందుకు వాయుసేన చేపట్టిన కార్యక్రమాల గురించి మోదీకి చెప్పినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి-'18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్.. మరికొద్ది గంటల్లో​!

ABOUT THE AUTHOR

...view details