జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని భద్రతా బలగాలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైన్యాధిపతి నరవాణె కూడా పాల్గొన్నారు.
"సైనికుల ముందుకు భారతీయులందరి శుభాకాంక్షలు తీసుకొచ్చా. వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తున్నా. మంచు కొండలు, ఎడారిలో నివసిస్తున్న సైనికులతో దీపావళి జరుపుకొంటున్నా. సైనికుల మధ్యకు వచ్చినప్పుడే నాకు నిజమైన దీపావళి. సైనికులు ఉత్సాహంగా ఉంటేనే మేము రెట్టింపు సంతోషంతో ఉంటాం. సైనికులు సంతోషంగా ఉంటేనే దేశమైనా, పండగైనా. దేశాన్ని ధైర్యంగా రక్షించే సైనికుల పట్ల భారతదేశం గర్విస్తోంది. ఆక్రమణదారులు, చొరబాటుదారులను ఎదుర్కొనే ధైర్యం మన సైనికులకు ఉంది.సైనికుల బలం, ధైర్యం చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు".
-- ప్రధాని నరేంద్ర మోదీ.
లాంగేవాలాను కాపాడుకున్నాం...