తెలంగాణ

telangana

ETV Bharat / bharat

PM Modi: 'వైద్య రంగంలోకి భారీగా ప్రైవేట్ సంస్థలు రావాలి' - ఉక్రెయిన్

PM Modi: దేశంలోని విద్యార్థులు వైద్య విద్య కోసం చిన్న దేశాలకు వెళ్తున్నారని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో భారీగా ప్రవేశించాలని, అందుకు అనువైన విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని చెప్పారు.

PM Modi
Medical sector

By

Published : Feb 26, 2022, 12:37 PM IST

Updated : Feb 26, 2022, 2:11 PM IST

PM Modi: వైద్య రంగంలోకి ప్రైవేట్ సంస్థలు భారీ స్థాయిలో ప్రవేశించాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వైద్య విద్య కోసం భాషాపరమైన అవరోధాలున్నప్పటికీ.. భారతీయ విద్యార్థులు చిన్న దేశాలకు సైతం తరలివెళ్తున్నారని చెప్పారు. శనివారం ఆరోగ్య రంగంపై బడ్జెట్​ ప్రకటనలపై వెబినార్​లో పాల్గొన్న సందర్భంగా.. ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్య కోసం విద్య కోసం చేసే భూ కేటాయింపులపై మంచి విధానాలను రూపొందించాలని మోదీ పేర్కొన్నారు. అప్పుడు ప్రపంచ అవసరాలు తీర్చే వైద్యులు భారత్​లోనే తయారవుతారని చెప్పారు.

రష్యాతో యద్ధం కారణంగా ఉక్రెయిన్​లో భారతీయ విద్యార్థులు చిక్కుకున్న వేళ.. మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వారిలో అధికశాతం మంది వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. ఇలా విదేశాలకు తరలివెళ్లడం మూలంగా విద్యార్థులు వందల కోట్లు వెచ్చించాల్సి వస్తోందని ప్రధాని చెప్పారు.

ఇదీ చూడండి:'దేశ రక్షణకు సైబర్​ భద్రతే కీలకం'

Last Updated : Feb 26, 2022, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details