కొవిడ్ 19 సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 130 కోట్ల భారతీయులను కాపాడుకుంటూనే.. వైరస్‌పై పోరాటంలో ఇతర దేశాలకు సహకారం అందిస్తున్నట్లు మంగళవారం వర్చువల్‌గా జరిగిన 'రైజీనా సదస్సు'లో చెప్పారు.
పాస్‌పోర్టు రంగుతో సంబంధం లేకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ వైరస్ నుంచి బయటపడితే తప్ప మహమ్మారిని జయించలేం. అందుకే ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ 80కి పైగా దేశాలకు టీకాలను సరఫరా చేశాం.