ప్రధాని నరేంద్ర మోదీ దైవ స్వరూపమని వ్యాఖ్యానించారు అరుణచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ గావో. దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్న భగవంతుడి అవతారమని పేర్కొన్నారు. బంగాల్, అసోం రాష్ట్రాల్లోని తేయా కార్మికుల కోసం అహర్నిశలు పని చేస్తున్న మోదీ.. 'భగవాన్, అల్లా'తో సమానమని అభివర్ణించారు తాపిర్. జమ్ముకశ్మీర్‌కు నిధుల కోసం అనుబంధ డిమాండ్లపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు..
"ఆయన (ప్రధాని) మానవుడు కాదు. ప్రధానిగా మారి దేశాన్ని సరైన దిశలో నిడిపిస్తున్న భగవంతుడి అవతారం. భారతీయులుగా మనం గర్వపడాలి. అసోం, బంగాల్లోని తేయాకు తోటల కార్మికుల సమస్యలను తరిమికొట్టే పని మోదీజీ చేశారు. ఇది భగవంతుని (భగవాన్, అల్లా) అవతారం ద్వారా చేసిన పనే."
- తాపిర్ గావో, అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ