UP Elections 2022: దేశ భక్తికి.. కుటుంబ భక్తికి చాలా తేడా ఉంటుందని ప్రతిపక్షాలనుద్దేశించి విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయుధ సంపత్తిలో భారత్ ఇతర దేశాలపై ఆధారపడేలా గత ప్రభుత్వాల చేశాయని ఆరోపించారు. కానీ, తమ హయాంలో ఆత్మనిర్భర్‌తో దాన్ని అధిగమించామని చెప్పారు. యూపీలోని బస్తీలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో కుల, మతాలకతీతంగా భారత్‌ను బలమైన దేశంగా మార్చాలని ప్రధాని మోదీ అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వందలాది మందిని స్వదేశానికి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య ఎదురైనా భారతీయులను తీసుకురావడానికి ప్రభుత్వం ముందుందని పేర్కొన్నారు.