తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారణాసిలో 'గంగాహారతి'- మోదీ హాజరు - కాశీ ప్రాజెక్ట్​

Prime Minister Narendra Modi will visit his parliamentary constituency Varanasi in Uttar Pradesh and inaugurate the newly-constructed Kashi Vishwanath Dham built at a cost of around Rs 339 crores today. Chief Ministers of 12 states will accompany PM Modi during the inauguration of the project.

Kashi Vishwanath Dham
Kashi Vishwanath Dham

By

Published : Dec 13, 2021, 11:10 AM IST

Updated : Dec 13, 2021, 7:01 PM IST

18:26 December 13

వారణాసిలో 'గంగా హారతి'- మోదీ హాజరు

ఉత్తర్​ప్రదేశ్​, వారణాసిలోని రవిదాస్​ ఘాట్​లో నిర్వహించిన గంగా హారతిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​తో పాటు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎలక్ట్రిక్​ వాహనంలో గంగా తీరానికి చేరుకున్న ప్రధాని.. స్వామి వివేకానంద క్రూయిజ్​ షిప్​లో నదిలోకి వెళ్లి గంగా హారతిని తిలకించారు.

గంగా హారతిని తిలకించేందుకు భారీగా తరలివచ్చారు ప్రజలు. ఈ కార్యక్రమంలో పలువురు భాజపా పాలిత ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

గంగాహారతి సందర్భంగా రవిదాస్​ ఘాట్​ విద్యుత్తు దీపాల కాంతులతో మెరిసిపోయింది. నగరంలో శివ దీపోత్సవం నిర్వహించారు.

16:48 December 13

వారణాసి ప్రత్యేకం..

ప్రపంచ చరిత్రలో వారణాసికి ప్రత్యేక స్థానం ఉందని మోదీ కొనియాడారు. ఎందరో సుల్తాన్​లు పుట్టుకొచ్చినా, నేలకూలినా.. బెనారస్​ మాత్రం అలాగే చెక్కుచెదరకుండా ఉందని అన్నారు.

''ఎందరో ఆక్రమణదారులు వారణాసిపై దండెత్తారు. ధ్వంసం చేయాలని చూశారు. ఔరంగజేబు కుట్రలు, దురాగతాలను చరిత్ర చెబుతోంది. కత్తి పట్టుకొని.. వారణాసిని మార్చేద్దామనుకున్నాడు. మతోన్మాదంతో సంస్కృతిని అణచివేసే ప్రయత్నం చేశాడు. కానీ ప్రపంచం కంటే భారతనేల భిన్నమైంది. ఇక్కడ మొఘల్​ చక్రవర్తి ఔరంగజేబు​ వస్తే.. అక్కడ మరాఠా యోధుడు శివాజీ కూడా పుట్టుకొచ్చాడు.''

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

15:41 December 13

బోట్​లో విహరించిన మోదీ..

లలితా ఘాట్​ నుంచి రవిదాస్​ ఘాట్​కు మోదీ బోట్​లో ప్రయాణించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్​తో కలిసి కాశీ విశ్వనాథ్​ నడవా అభివృద్ధి పనులను జాగ్రత్తగా పరిశీలించారు.

15:09 December 13

కార్మికులతో లంచ్​..

కాశీ విశ్వనాథ్​ నడవా ప్రారంభించిన అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు. ప్రధాని వాళ్ల మధ్యలో కూర్చోవడం విశేషం. మోదీకి ఎదురుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ కూడా ఉన్నారు.

కాశీ విశ్వనాథ్​ నడవా నిర్మాణంలో ఈ కార్మికులు భాగస్వామ్యమయ్యారు.

13:55 December 13

  • కాశీ విశ్వనాథ్ నడవాను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూ నడవా నిర్మాణం
  • కాశీ విశ్వనాథ్ నడవాను ప్రజలకు అంకితం చేసిన ప్రధాని
  • రూ.399 కోట్లతో పూర్తయిన తొలిదశ పనుల ప్రారంభోత్సవం
  • అందరికీ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు ఉంటాయి: ప్రధాని మోదీ
  • కాశీ విశ్వనాథుడి పాదాలకు నమస్కరిస్తున్నా: ప్రధాని మోదీ
  • ఎన్నో ఏళ్లు వేచిచూసిన సమయం ఆసన్నమైంది: ప్రధాని మోదీ
  • కాశీలో అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విముక్తి: ప్రధాని
  • కాశీలో అడుగుపెట్టగానే అంతరాత్మ మేల్కొంటుంది: ప్రధాని
  • కాశీ చరిత్రలో ఇవాళ నూతన అధ్యాయం రచించాం: ప్రధాని మోదీ
  • భారత ప్రాచీనతకు, సాంప్రదాయానికి కాశీ ప్రతీక: ప్రధాని మోదీ
  • ఈనాటి కార్యక్రమంతో గంగా నది ప్రసన్నమైంది: ప్రధాని మోదీ
  • విశ్వనాథుడి దర్శనానికి దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం: ప్రధాని
  • కొందరు వారణాసి అంశాన్ని కూడా రాజకీయం చేశారు: ప్రధాని
  • కాశీలో శివుడి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు: ప్రధాని మోదీ

13:49 December 13

'కాశీ విశ్వనాథ్ కారిడార్​'ను ప్రారంభించిన మోదీ

ఉత్తర్​ప్రదేశ్​ వారణాసి పట్టణంలో నిర్మించిన 'కాశీ విశ్వనాథ్ కారిడార్​'ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మోదీ కలల ప్రాజెక్టు అయిన కాశీక్షేత్ర అభివృద్ధి కారిడార్​ను దేశ ప్రజలకు అంకితం చేశారు.

13:35 December 13

కాశీ ఆధునికీకరణతో ఆనందం..

కాశీ ఆధునీకరణ కాశీ వాసులకే కాదు.. యావత్ దేశంలోని భక్తులందరికీ ఆనందం కలిగించింది: యోగి ఆదిత్యనాథ్​

కాశీకి ప్రధాని ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం: యోగి ఆదిత్యనాథ్

వేల ఏళ్ల తపస్సుల ఫలం ఇవాళ మనకు దక్కింది: యోగి ఆదిత్యనాథ్

13:22 December 13

పారిశుద్ధ్య కార్మికులపై మోదీ పూలవర్షం..

వారణాసి కాశీ విశ్వనాథుడి ఆలయంలో.. కార్మికులపై మోదీ పూలు జల్లారు. ఈ ఆలయ నడవా నిర్మాణంలో వీరంతా భాగస్వామ్యం అయ్యారు. అనంతరం వారి మధ్యలో కూర్చొని ఫొటో దిగారు మోదీ.

12:55 December 13

Modi Offers Prayers at the Kashi Vishwanath Temple

గంగా నదిలో స్నానం ఆచరించిన తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయానికి చేరుకున్న ప్రధాని అక్కడ పూజలు చేశారు.

12:12 December 13

Modi takes holy dip in River Ganga

లలితా ఘాట్​కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. గంగా నదిలో పుణ్యస్నానం చేశారు. నదిలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి.. పూజలు చేశారు. కలశంతో నదిలో పుష్పాలు వదిలారు.

12:06 December 13

లలతా ఘాట్​కు మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ లలితా ఘాట్​కు చేరుకున్నారు. కాసేపట్లో కాశీ విశ్వనాథ్​ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు.

12:05 December 13

అడుగడుగునా అభివందనం..

వారణాసిలో ప్రధానికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ.. మోదీ మోదీ, హర్​ హర్​ మహాదేవ్​ అంటూ నినాదాలు చేశారు.

11:45 December 13

పడవలో యోగితో మోదీ..

కాశీ విశ్వనాథ్​ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నదీమార్గంలో లలితా ఘాట్​కు బయల్దేరారు. ప్రధానితో ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ కూడా డబుల్​ డెక్కర్​ పడవలో ప్రయాణిస్తున్నారు.

11:24 December 13

సొంత నియోజకవర్గంలో మోదీకి ఘనస్వాగతం..

ప్రధాని నరేంద్ర మోదీకి తన సొంత నియోజకవర్గం వారణాసిలో ఘనస్వాగతం లభించింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు మోదీ.

11:20 December 13

హారతి ఇచ్చిన మోదీ..

కాలభైరవ ఆలయంలో పూజలు నిర్వహించిన మోదీ.. హారతి సమర్పించారు.

11:11 December 13

Narendra Modi offers prayers at Kaal Bhiarav temple

వారణాసిలోని కాలభైరవ ఆలయంలో ప్రధాని పూజలు చేశారు. కాలభైరవుడికి హారతి ఇచ్చారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు కాశీ విశ్వనాథ్​ ఆలయంలో పూజలు నిర్వహించనున్న మోదీ.. 1.20 గంటలకు కాశీ విశ్వనాథ్​ నడవాను ప్రారంభిస్తారు.

10:53 December 13

Kashi Vishwanath Dham: వారణాసిలో మోదీకి ఘనస్వాగతం

Kashi Vishwanath Dham: పవిత్ర కాశీ విశ్వనాథుడి ఆలయ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూ నిర్మించిన నడవాను ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి చేరుకున్నారు.

  • ఈ ప్రాజెక్టు తొలి దశ పనుల కోసం రూ. 339 కోట్లు వెచ్చించారు.
  • ఈ కార్యక్రమంలో వివిధ మఠాలకు చెందిన 3 వేలమందికిపైగా సాధువులు, మత పెద్దలు, కళాకారులు, పురప్రముఖులతో పాటు భాజపా పాలిత 12 రాష్ట్రాల సీఎంలూ పాల్గొననున్నారు.
  • నడవాను ప్రారంభించిన తర్వాత గంగానదిలో విహార నౌకపై సీఎంలతో సమావేశం కానున్నారు.
  • గంగా హారతిని కూడా నౌక నుంచే వీక్షించనున్నారు.
  • వారణాసి ఎంపీగా ఈ మెగా కారిడార్​ పనులకు 2019 మార్చి 8న మోదీ శంకుస్థాపన చేశారు.
Last Updated : Dec 13, 2021, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details