తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​ సమావేశాలకు సన్నద్ధమవ్వండి: మోదీ

వర్షకాల పార్లమెంట్​ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్​ చూస్తుంటే.. హస్తం నేతల ప్రశ్నలకు ధీటుగా జవాబు ఇచ్చేందుకు కొత్త మంత్రులు సిద్ధంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

Monsoon Session, bjp, congress
ప్రధాని నరేంద్ర మోదీ, పార్లమెంట్​ సమావేశాలు

By

Published : Jul 15, 2021, 6:34 AM IST

రాబోయే పార్లమెంటు వర్షకాల సమావేశాలకు కొత్తమంత్రులు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారి వారి మంత్రిత్వశాఖలపై పట్టు సాధించి.. ప్రతిపక్ష పార్టీలు అడిగే ప్రశ్నలకు ధీటుగా జవాబు ఇవ్వాలని కోరారు. ఇందుకుగాను తగిన కృషి చేయాలన్నారు.

పార్లమెంట్​లో అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర మంత్రి మండలి సమావేశంలో చర్చించారు. జూలై 19 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్​ సమావేశాలు ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. ఈ వర్షకాల సమావేశాల్లో కేంద్రం మొత్తంగా 17 కొత్త బిల్లులను పార్లమెంట్​లో ప్రవేశపెట్టనుంది. మరో ఆరు బిల్లులు ఉభయ సభలు, పార్లమెంటరీ ప్యానెళ్ల ముందు వివిధ దశలలో పెండింగ్‌లో ఉన్నాయి.

ముప్పేట దాడికి కాంగ్రెస్​...

రాబోయే పార్లమెంటు సమావేశాల్లో మోదీ సర్కారుపై ప్రశ్నలతో ముప్పేట దాడికి దిగేందుకు కాంగ్రెస్​ సిద్ధమైంది. ముఖ్యంగా కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం వైఫల్యాలు, చైనాతో సరిహద్దు వివాదం, అన్నదాతల ఆందోళనలు, రఫేల్​ ఒప్పందం, పెరిగిన ఇంధన ధరలను అస్త్రాలుగా చేసుకుని ఉభయ సభల్లో ప్రశ్నల వర్షం కురిపించనుంది. లోక్​సభలో అధీర్​ రంజన్​ చౌధరీ, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గేలు ఈ బాధ్యతలను తీసుకోనున్నారు.

సోనియా గాంధీ అధ్యక్షతన ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్​ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్​ సమావేశమై.. చర్చించింది. దీనికి మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, కాంగ్రెస్​నేత రాహుల్​గాంధీ హాజరయ్యారు. దీనిలో ప్రధానంగా పెరిపోతున్న నిరుద్యోగం, ధరలతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై అధికార పార్టీని నిలదీయాలని నాయకులు నిర్ణయించారు.

ఇదీ చూడండి:వాటిపై చర్చకు రాహుల్ పట్టు- నో చెప్పిన ఛైర్మన్!

ABOUT THE AUTHOR

...view details