తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేదార్​నాథ్​ అభివృద్ధి పనులను నిరంతరం సమీక్షిస్తున్నా' - modi kedarnath visit

Prime Minister Narendra Modi on Monday arrived at the Jolly Grant Airport in Dehradun as he would visit the Kedarnath temple.

PM Modi arrives in Uttarakhand, visits Kedarnath temple
13549508

By

Published : Nov 5, 2021, 8:22 AM IST

Updated : Nov 5, 2021, 12:28 PM IST

10:43 November 05

పుణ్యక్షేత్రాల సందర్శనతో ఆధ్యాత్మిక చింతన..

  • మహనీయుల చరిత్రను మననం చేసుకుందాం: ప్రధాని
  • ఆదిశంకరాచార్యుల రచనలు ఐక్యతను గుర్తుచేస్తాయి: ప్రధాని
  • ఉపనిషత్తులలో కనిపించే ఆలోచనలను విశదీకరిస్తాయి: ప్రధాని
  • ఆదిశంకరాచార్యుల రచనలు ఎంతోమందిని ప్రభావితం చేశాయి: ప్రధాని
  • పుణ్యక్షేత్రాల సందర్శనతో ఆధ్యాత్మిక చింతన చేకూరుతుంది: ప్రధాని
  • ఆదిశంకరాచార్య సమాధి స్థల్‌ ఆధ్యాత్మిక శ్రేయస్సుకు అపూర్వ దృశ్యం: ప్రధాని
  • కేదార్‌నాథ్‌లో అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తున్నా: ప్రధాని
  • 2013 విధ్వంసం తర్వాత మళ్లీ అభివృద్ధి సాధ్యమా అనుకున్నాం: ప్రధాని
  • ఇవాళ కేదార్‌నాథ్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి: ప్రధాని
  • ఆదిశంకరాచార్య సమాధి స్థల్‌ ప్రారంభం కావడమే నిదర్శనం: ప్రధాని
  • సమాజానికి జీవిత సత్యాన్ని తెలిపేందుకు ఆదిశంకరాచార్య కృషిచేశారు: ప్రధాని
  • అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నాం: ప్రధాని మోదీ
  • అయోధ్యలో ఇటీవల దీపోత్సవం ఘనంగా జరిగింది: ప్రధాని
  • వారణాసిలో వేగంగా కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టు పనులు: ప్రధాని
  • ఉన్నత లక్ష్యాల సాధనకు కాలపరిమితి నిర్దేశించి ముందుకెళ్తున్నాం: ప్రధాని

09:25 November 05

ఆదిశంకరాచార్య విగ్రహావిష్కరణ చేసిన ప్రధాని..

కేదార్​నాథ్​లో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని. 2019లో నిర్మాణపనులు ప్రారంభమైన ఈ విగ్రహం.. 12 అడుగుల ఎత్తు, 35 టన్నుల బరువు ఉంటుంది. ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణను.. దేశంలోని 12 జ్యోతిర్లింగాలు, 4 శంకరాచార్య మఠాలతోపాటు ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు

09:23 November 05

ప్రదక్షిణలు చేసిన ప్రధాని..

కేదార్​నాథ్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. ఆలయ ప్రదక్షిణలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. శివునికి నమస్కరించి.. హారతి ఇచ్చారు. 

08:34 November 05

కేదార్​నాథ్​ ఆలయంలో పూజలు..

ఉత్తరాఖండ్​ పర్యటనలో భాగంగా.. కేదార్​నాథ్​ ఆలయాన్ని సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రధాని పర్యటన సందర్భంగా.. రాష్ట్రంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. 

08:13 November 05

Modi in kedarnath: కేదార్​నాథ్​ సందర్శనలో ప్రధాని

ఉత్తరాఖండ్​లో మోదీ

శాసనసభ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్​లో (Modi kedarnath visit) పర్యటిస్తున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ ఉదయం దేహ్రాదూన్​ చేరుకున్న మోదీకి.. రాష్ట్ర గవర్నర్​ గుర్మిత్​ సింగ్​, ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామీ, స్థానిక అధికారులు ఘనస్వాగతం పలికారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు నేడు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 

తొలుత కేదార్​నాథ్ (Modi in kedarnath)​ వెళ్లిన మోదీ.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం.. ఆదిశంకరాచార్య సమాధి స్థల్​ను ప్రారంభిస్తారు. 

Last Updated : Nov 5, 2021, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details