తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని మోదీ, అక్షయ్‌, ప్రియాంక.. టీకా తీసుకుంది ఆ గ్రామంలోనే! - బిహార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్

Modi Vaccine In Bihar: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బాలీవుడ్ దిగ్గజ నటుడు అక్షయ్ కుమార్, అంతర్జాతీయ స్టార్ ప్రియాంక చోప్రా టీకా కరోనా టీకా తీసుకునేందుకు బిహార్​కు క్యూ కట్టిన విషయం మీకు తెలుసా?. అవునండీ నిజం.. కంప్యూటర్ ఆపరేటర్ల పుణ్యమా అని బిహార్​లోని ఓ ప్రాంతంలో నివసిస్తున్న వీరు.. ఇక్కడ టీకా తీసుకోవడమే కాదు.. కరోనా నిర్ధరణ పరీక్షలు సైతం అక్కడే చేయించుకున్నారంట. రాష్ట్ర ఆరోగ్య శాఖ చేపట్టిన విచారణలో ఈ విషయం బయటపడింది.

celebrities vaccine
ప్రముఖులు టీకా`

By

Published : Dec 7, 2021, 4:02 PM IST

celebrities vaccine in bihar: దేశ, విదేశాల్లో నివసిస్తూ.. అనునిత్యం బిజీబిజీగా గడిపే కొందరు ప్రముఖులు బిహార్​లోని మారుమూల ప్రాంతంలో కరోనా టీకా తీసుకున్నారట! వీరిలో ప్రధాని మోదీ, నటులు అక్షయ్‌ కుమార్‌, ప్రియాంక చోప్రా ఉన్నారు. అంతదూరం వెళ్లి ఎందుకు తీసుకున్నారు? ఏదైనా ప్రచారం, అవగాహన కార్యక్రమం కోసం అని మీరు అనుకుంటే పొరబడినట్లే. కేవలం గ్రామ పంచాయతీ ఉద్యోగుల నిర్వాకం వల్లే ప్రముఖులైన వీరంతా.. ఇలా మారుమూల ప్రాంతాలకు వచ్చి టీకా వేయించుకున్నట్లు తేలింది.

ఇదీ జరిగింది..

arwal bihar news: అర్వాల్ జిల్లా కార్పీ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో టీకాలు తీసుకున్నవారి వివరాలను ఇటీవలే 'వ్యాక్సినేషన్‌ పోర్టల్‌'లో ఉంచారు. ఆ జాబితాను పరిశీలించగా.. నరేంద్రమోదీ, అమిత్ షా, అక్షయ్‌ కుమార్‌, ప్రియాంక చోప్రా, సోనియా గాంధీ వంటి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. వీరంతా ఒక్కసారే గాక.. పలుమార్లు ఇదే కేంద్రంలో టీకా తీసుకున్నట్లు చూపడం గమనార్హం. దీనితో అధికారులు షాకయ్యారు.

ప్రముఖుల పేర్లతో జాబితా

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా యంత్రాంగం.. విచారణకు ఆదేశించింది. దీనిలో భాగంగా ఇద్దరు డేటా ఆపరేటర్లను విధుల నుంచి తొలగించింది. వారిపై ఎఫ్​ఐఆర్ సైతం నమోదు చేసినట్లు అర్వాల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ జె. ప్రియదర్శిని తెలిపారు. 'జిల్లాలోని ఇతర హెల్త్‌ సెంటర్లలోని రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నాం' అని తెలిపారు.

tejashwi yadav on bihar health department: ప్రముఖుల పేర్లతో ఉన్న వ్యాక్సినేషన్ జాబితాపై ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ విమర్శలు గుప్పించింది. వీటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్.. 'బిహార్‌లోని ఆరోగ్య శాఖ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. వివిధ సూచీల్లో దేశంలోనే రాష్ట్రాన్ని అట్టడుగున ఉంచేందుకు పాలకవర్గం తీవ్రంగా పోటీపడుతోందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ప్రముఖుల పేర్లతో జాబితా

వివిధ రికార్డుల నిర్వహణలో లోపం కారణంగా బిహార్ ప్రభుత్వం పలుసార్లు విమర్శలపాలైంది.

  • 1990లో వెలుగుచూసిన 'పశువుల దాణా' కుంభకోణంలో గేదేలను స్కూటర్‌పై తీసుకెళ్లినట్లు రికార్డుల్లో చూపించారు.
  • ఆ మధ్య ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన జాబితాలో బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, సన్నీలియోనీ పేర్లు ఉండటమూ వార్తల్లో నిలిచింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details