త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా ప్రచారహోరును పెంచునుంది భాజపా. ఈ దిశగా పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే వారం నుంచి మొదలుకొని ఈ నెల చివరి వరకు భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బంగాల్, అసోం, కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు.
మార్చి 18 మొదలు..
బంగాల్లోని పురలియాలో మార్చి 18తో శంఖారావం పూరించనున్న మోదీ.. ఆ రాష్ట్రంలో కాంటాయ్, బకురాల్లో మార్చి 20, 21తేదీల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. షా కూడా భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మార్చి 17, 21, 23న అసోంలో విస్తృతంగా ర్యాలీలు నిర్వహించనున్న షా.. మార్చి 19, 26, 27 తేదీల్లో బంగాల్‌లో భారీ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ మధ్యలో మార్చి 24, 25న కేరళలను సైతం సందర్శించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తాను భాజపా జాతీయ అధ్యక్షునిగా ఉన్నప్పుడు బంగాల్‌లో హత్యకు గురైన 122 మంది కార్యకర్తల కుటుంబాలను కూడా షా కలవనున్నారు.