PM Modi speech: కేంద్ర బడ్జెట్ రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత్ నిర్మాణానికి ఇది దోహదపడుతుందన్నారు. భాజపా కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమైన ఆయన.. బడ్జెట్‌పై ప్రసంగించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు మౌలిక వసతులు కల్పించండంపైనే కేంద్రం ప్రధానంగా దృష్టి సారించిననట్లు పేర్కొన్నారు.
" భారత్‌పై ప్రపంచ దేశాల అభిప్రాయం మారింది. మన ఆర్థికవ్యవస్థను అత్యంత వేగంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కరోనా తర్వత ప్రపంచ స్థితిగతులు మారాయి. భారత్‌ను మరింత పటిష్ఠంగా చూడాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి . భారత్‌ను స్వయంసమృద్ధ, ఆధునిక దేశంగా తీర్చిదిద్దడం అత్యంత కీలకం. ఈ బడ్జెట్ నవభారత్ నిర్మాణానికి మార్గం. కేంద్రం గత ఏడు సంవత్సరాలుగా తీసుకుంటున్న సరైన నిర్ణయాల వల్లే భారత ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ విస్తరిస్తోంది. ఏడేళ్ల క్రితం భారత జీడీపీ రూ.లక్షా 10వేల కోట్లుగా ఉంది. ఇప్పుడు రూ.2లక్షల 30వేల కోట్లకు పెరిగింది. దేశ విదేశీ మారక నిల్వలు 200 నుంచి 630 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ప్రభుత్వ సమర్థవంతమైన విధానాల వల్లే ఇది సాధ్యమైంది."
-ప్రధాని మోదీ.