కొవిడ్ వ్యాక్సిన్(Covid vaccine) విషయంలో గోవా అరుదైన మైలురాయి సాధించింది. రాష్ట్రంలో అర్హులైన అందరికీ కొవిడ్ మొదటి డోసు(vaccine first dose) వ్యాక్సిన్ వేసినట్లు(Vaccination) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. అక్టోబర్ 31 నాటికి ప్రజలందరికీ రెండో డోసు(covid vaccine second dose) కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ అదుపులోనే ఉందని చెప్పారు. అర్హులైన వారంతా సకాలంలో రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ సైతం ఇలాంటి ప్రకటనే చేసింది. అర్హులైన వారందరికీ నూరు శాతం వ్యాక్సిన్ వేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ వెల్లడించారు. నవంబర్ 30 నాటికి అందరికీ రెండు డోసులూ పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. అర్హులైన నూరు శాతం తొలి డోసు పూర్తిచేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్ నిలవగా.. గోవా రెండోస్థానంలో ఉంది.