PM Kisan Samman Nidhi 15th Installment : ఝార్ఖండ్‌పై వరాల జల్లు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సుమారు రూ.50 వేల కోట్లతో పలు రకాల కొత్త పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దేశంలోని గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన రూ.24 వేల కోట్ల మిషన్‌ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. గిరిజనుల ఆరాధ్యుడు బిర్సా ముండా జయంతి, మూడో జనజాతి దినోత్సవం సందర్భంగా ఝార్ఖండ్‌లోని కుంతి జిల్లా కేంద్రంలో ఈ మిషన్‌ను ప్రారంభించారు.
ఈ మిషన్‌లో భాగంగా మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్లు, టెలికాం, విద్యుత్తు, గృహ నిర్మాణం, తాగునీరు, శానిటేషన్, మెరుగైన విద్యావకాశాలు, వైద్యం, సుస్థిర జీవనానికి అవకాశాలు కల్పించనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు మోదీ. ఈ సందర్భంగా కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత నిధులు.. 18వేల కోట్ల రూపాయలను కూడా ప్రధాని మోదీ విడుదల చేశారు. వ్యవసాయ అవసరాల కోసం ప్రతి ఏడాది 6వేల రూపాయలను మూడు వాయిదాల్లో కేంద్రం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలపై కాంగ్రెస్ ఫైర్
మరోవైపు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పోలింగ్‌కు 2రోజుల ముందు కిసాన్ సమ్మాన్ నిధి నిధులను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ఎప్పుడో చెల్లించాల్సిన వాయిదా మొత్తాన్ని ఇప్పుడు ఇవ్వడం ఉద్దేశపూర్వకం కాదా అని ప్రశ్నించింది. కిసాన్ సమ్మాన్ నిధి 6వ విడత నిధులను 2020 ఆగస్టు ఒకటిన, 9వ విడత 2021 ఆగస్టు 9న, 12వ విడత నిధులు 2022 అక్టోబర్ 17న విడుదల చేసిన కేంద్రం..15వ విడత నిధులను బుధవారం రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌కు రెండురోజుల ముందు, రాజస్థాన్‌లో ఓటింగ్‌కు 10 రోజులు, తెలంగాణలో 15 రోజుల ముందు 15వ విడత కిసాన్ సమ్మాన్ నిధి నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. నిధుల విడుదల ఆలస్యం చేయటం ఉద్దేశపూర్వకం కాదా అని జైరాం రమేశ్ ప్రశ్నించారు.
ప్రధాని, అదానీపై నిరాధార ఆరోపణలు! కేజ్రీవాల్, ప్రియాంకకు ఈసీ నోటీసులు
జవాన్లతో కలిసి మోదీ దీపావళి సంబరాలు- దేశ ప్రజలకు ప్రధాని పండగ శుభాకాంక్షలు