తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులకు శుభవార్త! ఈ స్కీమ్​లో చేరితే నెలకు 3వేల పింఛన్!

PM Kisan Maan Dhan Yojana Scheme : చిన్న, సన్నకారు రైతులకు శుభవార్త. మీకోసం కేంద్ర మరో స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్​లో చేరితే.. నెలకు 3వేల రూపాయల పింఛన్ పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

PM Kisan Maan Dhan Yojana
PM Kisan Maan Dhan Yojana

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 11:23 AM IST

PM Kisan Maan Dhan Yojana Details in Telugu :సన్నకారు రైతులకు 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత నెలకు రూ.3వేల పెన్షన్ పొందే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే.. 'ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన(PMKMY)'. ఇంతకీ పీఎం కిసాన్ మాన్​ధన్ యోజన అంటే ఏమిటి? ఎవరెవరు అర్హులు? ఏమేమి పత్రాలు అవసరం? నెలకు రూ.3వేలు ఎలా పొందవచ్చు? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పీఎం మాన్‌ధన్‌ యోజన అంటే ఏమిటి? (What is PM Maandhan Yojana) :కేంద్రం రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటే.. ఈ ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్‌ యోజన (Pradhan Mantri Kisan Maan Dhan Yojana). చిన్న, సన్నకారు రైతుల కోసం రూపొందించబడిన ఈ పథకం పెన్షన్ మొత్తాన్ని నిర్ధారించడానికి ఉద్దేశించబడింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల తరహాలో రైతులకు పింఛను ప్రయోజనాలను అందించడానికి దీనిని రూపొందించారు.

ఈ స్కీమ్​కి ఎవరు అర్హులంటే? (PM Kisan Maandhan Yojana Eligibility ) :ఈ పథకానికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు అర్హులు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డుల్లో పేర్లు ఉండి.. అలాగే వారు 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమిని కలిగి ఉండాలి. అలాంటి చిన్న, సన్నకారు రైతులందరూ ఈ స్కీమ్ కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు. అర్హులైనవారు కామన్‌ సర్వీస్‌ సెంటర్లలో ఆన్‌లైన్‌ ద్వారా సాగుదారులు తమపేర్లను రిజిస్ట్రర్ చేయాలి. పింఛన్‌ మాత్రం 60 సంవత్సరాలు నిండిన తర్వాతే అందుతుంది.

వీరికి అర్హత లేదు : నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌), ఈఎస్‌ఐ స్కీమ్‌, ఈపీఎఫ్‌వో పరిధిలో ఉన్నవారు, ఏవైనా ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, జాతీయ పెన్షన్‌ పథకాన్ని ఎంచుకున్న రైతులు, ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వర్గాల వారు ఈ పింఛన్‌ పొందడానికి అనర్హులు.

దరఖాస్తు సమయంలో ఈ పత్రాలు అవసరం :రైతు పాస్​పోర్ట్ ఫొటో, నివాస ధ్రువీకరణ, ఆదాయ రుజువు, వయసు నిర్ధారణ, సాగు భూమి, బ్యాంక్ పాస్​బుక్, ఆధార్‌ తదితర పత్రాలను సమర్పించాలి. అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరం. దీనికి సంబంధించిన అన్ని వివరాలనూ కేంద్ర పీఎంకేఎం పోర్టర్‌లో నమోదు చేసిన తరువాత రైతుకు సమాచారం వస్తుంది.

PM Kisan Samman Nidhi Amount : రైతులకు గుడ్‌న్యూస్‌.. 'PM కిసాన్‌' పథకం కింద మరో రూ.2 వేలు ఎక్స్​ట్రా!

రైతులు కొంత ప్రీమియం కట్టాలి :ఈ పథకంలో చేరిన రైతులు వారి వయస్సు ప్రకారం 60 సంవత్సరాలు నిండేవరకు ప్రతినెలా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెలా రూ.3 వేల పింఛన్‌ అందుతుంది. దీనిలో చేరే వారికి వయసును బట్టి ప్రీమియం ఉండగా.. రైతు చెల్లించిన మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా తనవంతుగా బీమా కంపెనీకి చెల్లిస్తుంది.

ఉదాహరణకు 18 ఏళ్లు ఉన్న రైతు తనవాటాగా నెలకు రూ.55 చెల్లిస్తే కేంద్రం తనవాటాగా రూ.55ను కలిపి బీమా కంపెనీకి రూ.110 చెల్లిస్తుంది. 18 సంవత్సరాల వారికి ప్రీమియం రూ.55 ఉండగా ఏటా వయసును బట్టి రూ.3 నుంచి రూ.10 వరకు పెరుగుతుంది. 40 ఏళ్లవారు నెలకు రూ.200 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.

Kisan Rin Portal Details and Benefits in Telugu : అన్నదాతకు శుభవార్త.. అప్పుకోసం వడ్డీ వ్యాపారి వద్దకు అవసరం లేదు!

ఈకేవైసీ లేనిదే.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావు..

ABOUT THE AUTHOR

...view details