PM Kisan 15th Installment 2023 :అన్నదాతలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి" పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. రైతుల అవసరాలకు ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో.. ఈ పథకం ద్వారా ఏడాదికి 6 వేల రూపాయలను రైతులకు అందజేస్తోంది. ఈ నగదు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. అయితే.. ఒకేసారి కాకుండా.. మొత్తం 3 దఫాలుగా ఈ డబ్బులు అకౌంట్లో వేస్తారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ఈ నిధులు జమ చేస్తారు.
ఇప్పటిదాకా 14 సార్లు..
రైతులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే ఈ కార్యక్రమాన్ని.. కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన అన్నదాతలు ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి 2 వేల రూపాయలు అందుకుంటారు. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 14 సార్లు 2వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు వేసింది కేంద్రం. ఈ ఏడాది జులైలో 14వ విడత నిధులు జమ అయ్యాయి. ఇప్పుడు 15వ విడత డబ్బులు క్రెడిట్ కావాల్సి ఉంది.
నిధులు జమ అయ్యేది అప్పుడే..?
15వ విడతుకు సంబంధించిన 2వేల రూపాయలు నవంబరు చివరి వారంలో.. రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉందని సమాచారం. కాస్త ముందో.. వెనకో.. మొత్తానికి నవంబరులోనే నిధులు విడుదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. 2019లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి.. దీని కింద ఇప్పటి వరకూ దాదాపు రూ. రెండున్నర లక్షల కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్టు అంచనా.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఇలా చెక్ చేయండి.. (PM Kisan 15th Installment 2023 How to Check Beneficiary Status) :
1. www.pmkisan.gov.in వెబ్ సైట్లోకి వెళ్లండి.
2. "Beneficiary List" ఆప్షన్పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు.. మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోండి.
4. లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" క్లిక్ చేయండి.