PM Kisan 10th Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకానికి సంబంధించి 10వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేయనున్నారు. 2022, జనవరి 1న 10కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ. 20వేల కోట్లు అందనున్నాయి.
ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తామని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇప్పటివరకు రూ. 1.6లక్షల కోట్లను రైతు కుటుంబాలకు అందించామని తెలిపింది.