సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషించారు. పరీక్షలు రద్దైనందున ఈ సమయాన్ని సృజనాత్మకంగా వినియోగించుకోవాలని సూచించారు. పరీక్షలు ఏవైనా ఒత్తిడికి గురికావొద్దని అన్నారు.
కేంద్ర విద్యా శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. విద్యార్థులు, వారి తల్లితండ్రులు దీనికి హాజరయ్యారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ఆకస్మికంగా హాజరై విద్యార్థులను ఆశ్చర్యపరిచారు. పరీక్షలు రద్దైనందున ఏం చేయాలనుకుంటున్నారని విద్యార్థులను అడిగారు మోదీ. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి గుర్తుంచుకోవాలని సూచించారు.
కరోనాను జయిస్తాం