Mayors Conference 2021: 'న్యూ అర్బన్ ఇండియా' నేపథ్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత మేయర్ల సదస్సును ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం భారత్కు కావాల్సింది వికాసమే కానీ విప్లవం కాదన్నారు. మేయర్లు తమ నగరాలను అత్యంత స్వచ్ఛత కలిగినవిగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛత అభియాన్ పట్ల నిర్లక్ష్యం వహించిన నగరాల జాబితా తయారు చేసి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలిచిన నగరాలతో పాటు అందుకు కృషి చేసిన ఇతర ప్రాంతాలనూ గుర్తించాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి సూచించారు.