క్రీడలు కేవలం హాబీలే కాదని.. అవి బృంద స్ఫూర్తిని పెంపొందిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు, విజయం దిశగా అడుగులు వేసేందుకు మార్గాలు ఇస్తాయని పేర్కొన్నారు. మనలో ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తాయన్నారు.
జమ్ముకశ్మీర్ గుల్మర్గ్లో 2వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌ను ప్రారంభించారు మోదీ. వర్చువల్‌గా ఈ వేడుకకు హాజరైన ఆయన.. జమ్ముకశ్మీర్‌ను వింటర్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు.
"'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్'ను మెరుగుపరిచేందుకు ఈ క్రీడలు ఉపయోగపతాయి. ఈ ఏడాది పోటీదారులు పెరిగారని విన్నాను. దేశంలో క్రీడలకు ప్రాధాన్యం పెరుగుతోందని దీన్ని బట్టి అర్థమవుతుంది. వింటర్ గేమ్స్ భారత ఉనికిని అంతర్జాతీయంగా చాటుచెబుతాయి."