దేశాన్ని పాలించే నైతిక హక్కును ప్రధాని మోదీ కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. కరోనా సెకండ్‌వేవ్ వేళ దేశ ప్రజలంతా వైద్య సాయంకోసం ఎదురు చూస్తుంటే ఆయన రాజకీయాల కోసం వెంపర్లాడారని దుయ్యబట్టారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు.
కొవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా ఆస్పత్రుల వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రధాని.. బెంగాల్, అసాం వంటి రాష్ట్రాల రాజకీయాల్లో బిజీగా గడిపారని సిబల్ ఎద్దేవా చేశారు. అందుకే ఆయనకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కూడా లేకుండా పోయిందని అంగీకరించారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తేవాల్సిన అవసరాన్ని తాను గుర్తు చేస్తున్నానని అన్నారు.