తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవిడ్​ వేళ.. శాస్త్రవేత్తల సేవలు ప్రశంసనీయం' - జాతీయ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలను అభినందించిన మోదీ

జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా.. శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో అనేక సవాళ్లకు ఎదురొడ్డి వారు ఎన్నో సేవలందిస్తున్నారన్నారు.

Narendra Modi, Indian PM
నరేంద్ర మోదీ, భారత ప్రధాని

By

Published : May 11, 2021, 1:19 PM IST

జాతీయ సాంకేతిక దినోత్సవం పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. పరిశోధకులపై ప్రశంసలు కురిపించారు. శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు.. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కొవిడ్​పై పోరాటం చేస్తున్నారని.. ట్విట్టర్​ వేదికగా వారి సేవల్ని కొనియాడారు.

నరేంద్ర మోదీ ట్వీట్​

"భారత సాంకేతిక దినోత్సవం సందర్భంగా.. మన శాస్త్రవేత్తలు, సాంకేతిక పరిజ్ఞానం పట్ల అభిరుచి కలిగిన వారందరికీ అభినందనలు. దేశీయ శాస్త్ర సాంకేతికతను సగర్వంగా చాటిచెప్పిన 1998 పోఖ్రాన్​ పరీక్షను ఎప్పటికీ విస్మరించలేము."

- నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

1998లో.. రాజస్థాన్​లోని పోఖ్రాన్​లో జరిగిన భూగర్భ అణుపరీక్షల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని.. ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటోంది భారత్​. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతీయులు సాధించిన విజయాలను, వారి సహాయ సహకారాల్ని ఈ సందర్భంగా స్మరించుకుంటారు.

ఇదీ చదవండి:సోషల్ మీడియా వేదికగా కరోనాపై కాంగ్రెస్ పోరు!

ABOUT THE AUTHOR

...view details