రాజ్యాంగ దినోత్సవం(నవంబరు 26) సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi News Latest). ఈ సందర్భంగా నవంబరు 4, 1948న రాజ్యాంగ పరిషత్తులో.. డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ స్పీచ్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు మోదీ. భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్. రాజేంద్రప్రసాద్ స్ఫూర్తి దేశానికి మార్గదర్శకమని కొనియాడుతూ ట్వీట్ చేశారు.
ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు..
రాజ్యాంగ దినోత్సవం(Constitution Day 2021) సందర్భంగా.. దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah naidu news). భారత రాజ్యంగ నిర్మాణానికి కృషి చేసిన డాక్టర్. బీఆర్ అంబేడ్కర్, ఇంకా అనేక మంది మహనీయులకు భారతజాతి రుణపడి ఉందన్నారు. సమీకృత న్యాయం, స్వేచ్ఛ, సమానత్వమే ధ్యేయంగా రాజ్యాంగ నిర్మాణం జరిగిందన్నారు.
ఆయన అడుగుజాడల్లో..