తెలంగాణ

telangana

ETV Bharat / bharat

PM Modi: 'ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అదే కీలకం' - మోదీ

PM Modi: భారత్​లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో పీఎం గతి శక్తి ప్లాన్​ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వివిధ శాఖల మధ్య సమన్వయం నెలకొల్పడం ద్వారా వివాదాలకు తావులేకుండా ఉంటుంది అన్నారు.

pm gati shakti
pm modi

By

Published : Feb 28, 2022, 11:16 AM IST

Updated : Feb 28, 2022, 12:10 PM IST

PM Modi: దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడంలో పీఎం గతి శక్తి యోజన కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రభుత్వంతో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కావాలని, పెట్టుబడులు పెంచాలని కోరారు. పీఎం గతి శక్తిపై సోమవారం నిర్వహించిన వెబినార్​లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"వివిధ శాఖల వద్ద అన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన వివారాలు లేకపోవడం వల్ల రోడ్డు, రైలు పనుల మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. పీఎం గతి శక్తి ద్వారా మౌలిక సదుపాయాల ప్లానింగ్​, అమలు, పర్యవేక్షణ సమన్వయంతో జరిగేలా చూడొచ్చు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో గతి శక్తి - జాతీయ మాస్టర్​ ప్లాన్​ కీలక పాత్ర పోషిస్తుంది. "

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈశాన్య ప్రాంత సమతుల్య అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. రహదారులు, ఆప్టికల్ ఫైబర్​ అనుసంధానం, పునరుత్పాద ఇంధనం వంటి అన్ని రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులను పెంచిందని తెలిపారు. గతి శక్తి ద్వారా ఎగుమతులకు ఊతం లభిస్తుందని మోదీ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రపంచస్థాయిలో పోటీపడేలా చేస్తుందని చెప్పారు.

ఏంటీ గతి శక్తి?

దేశంలో బహుముఖ అనుసంధానం కోసం ఉద్దేశించి రూ. 100 లక్షల కోట్లతో 'పీఎం గతిశక్తి' కార్యక్రమాన్ని రూపొందించారు. మౌలిక రంగాన్ని సమూలంగా మార్పు చేసి, శాఖల మధ్య సమన్వయం తీసుకొచ్చేలా దీన్ని సిద్ధం చేశారు. గతేడాది ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భాగంగా గతి శక్తి కార్యక్రమాన్ని ప్రకటించారు ప్రధాని మోదీ.

మౌలిక వసతుల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే శక్తి ఈ కార్యక్రమానికి ఉన్నట్లు ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. గతిశక్తి కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనులను 2024-25 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనుమతుల్లో జాప్యాన్ని నివారించి మౌలిక వసతుల నిర్మాణాన్ని సంపూర్ణంగా, వేగంగా కొనసాగించడానికి గతిశక్తి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కేంద్రం పేర్కొంది.

ఇదీ చూడండి:మణిపుర్​లో తొలిదశ పోలింగ్.. ఓటేసిన సీఎం బీరేన్ సింగ్

Last Updated : Feb 28, 2022, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details