తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీజీ.. మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి? ' - దేశంలో మరణాల పెరుగుదలపై ప్రధానిని ప్రశ్నించిన మమత

దేశంలో మరణాల సంఖ్య విపరీతంగా పెరగడంపై ప్రధాని మోదీ పెదవి విప్పాలని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్​ చేశారు. కరోనాపై రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశం సూపర్​ ప్లాఫ్​ అయ్యిందన్నారు.

Mamata Banerjee.
మమతా బెనర్జీ

By

Published : May 20, 2021, 2:57 PM IST

Updated : May 20, 2021, 4:03 PM IST

కొవిడ్​పై రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశం సూపర్ ప్లాఫ్ అయిందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దేశంలో కేసుల సంఖ్య తగ్గుతోందని అంటున్న మోదీ.. మరణాల సంఖ్య ఎందుకు పెరుగుతోందో చెప్పాలని ప్రశ్నించారు.

తనతో పాటు చాలా రాష్ట్రాల సీఎంలకు సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మమత అన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. తమను కేవలం నామమాత్రులుగా పరిగణించి అవమానించారని అన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని విస్మరించడమేనని తెలిపారు. సమావేశంలో ప్రధాని మోదీ చాలా అభద్రతాభావంతో.. తమ మాటలు వినలేదని వివరించారు. బంగాల్​ గురించి ఏ మాత్రం సమాచారాన్ని అడగలేదని ఆరోపించారు.

వారికి వ్యాక్సిన్ వేయండి..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొదట వ్యాక్సిన్ అందించాలని ప్రధానిని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. రైల్వేలు, విమానయాన, నౌకాయాన, రక్షణ, బ్యాంకులు, బీమా, తపాల, బొగ్గు తదితర సంస్థల్లో పనిచేసే వారికి తక్షణం టీకా వేయాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:పినరయి విజయన్​ అనే నేను..

Last Updated : May 20, 2021, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details