PM Cares for Children: కరోనా కారణంగా అనాథులైన 3481 చిన్నారులకు 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్' పథకం అండగా నిలుస్తుందని కేంద్రం సోమవారం వెల్లడించింది. ఈనెల 24 నాటికి మొత్తం 6098 దరఖాస్తులు అందగా.. అందులో నుంచి 3481 అప్లికేషన్లను జిల్లా మెజిస్ట్రేట్లు ఆమోదించినట్లు పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటికే 3275 మందికి పోస్ట్ ఆఫీస్ ఖాతాలు కూడా తెరిచినట్లు కేంద్రం తెలిపింది.
ఈ పథకంలో భాగంగా సంరక్షణ సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు నెలకు రూ.2160 చొప్పున కేంద్రం అందించనుంది. మరోవైపు స్వతంత్రంగా నివసిస్తున్న పిల్లలకు నెలకు రూ.2000 చొప్పున అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది.