తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దివ్యాంగుల మెరుగైన జీవితం కోసం సమష్టిగా కృషి అవసరం' - ఐక్యరాజ్య సమితి

విధిని ఎదురొడ్డి నిలిచిన దివ్యాంగుల ధైర్యం ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారి కోసం భారత్​ అనేక చర్యలు చేపట్టిందని.. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ట్వీట్​ చేశారు మోదీ. వారి జీవితంలో సానుకూల మార్పు కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

By

Published : Dec 3, 2020, 12:08 PM IST

దివ్యాంగుల జీవితంలో సానుకూల మార్పు కోసం భారత్ అనేక​ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారికి అవకాశాలు కల్పించటం, వాటిని పొందే మార్గాన్ని మెరుగుపరచటానికి అందరం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి.. ఈఏడాది " మంచి స్థానానికి తిరిగి చేరుకోవటం: దివ్యాంగులను కలుపుకొని కొవిడ్​ అనంతరం స్థిరమైన ప్రపంచంవైపు అడుగులు వేద్దాం" అనే థీమ్​తో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఐరాస పిలుపు నేపథ్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం హాష్​ట్యాగ్​తో ట్వీట్​ చేశారు మోదీ.

మోదీ ట్వీట్​

" విధిని ఎదురొడ్డి నిలిచిన దివ్యాంగుల ధైర్యం మనకు స్ఫూర్తినిస్తుంది. దివ్యాంగులైన సోదరసోదరీమణుల జీవితాల్లో సానుకూల మార్పు కోసం అనేక చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది ఐరాస తీసుకున్న థీమ్​లో భాగంగా మనమంతా.. మన దివ్యాంగులకు అవకాశాలు కల్పించటం, వాటిని పొందే మార్గాలను మెరుగుపరచటం కోసం సమష్టిగా కృషి చేద్దాం"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఈ ఏడాది వికలాంగుల హక్కుల సదస్సును, డిసెంబర్​ 4న జరిగే 13వ సభ్య దేశాల సదస్సుతో పాటుగా నిర్వహించి.. దివ్యాంగులను గౌరవించుకోనున్నట్లు తెలిపింది ఐక్యరాజ్య సమితి.

ఇదీ చూడండి:దివ్యాంగుల హక్కుల విస్మరణలో 'వైకల్యం' విధానాలదే!

ABOUT THE AUTHOR

...view details