తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకా తీసుకునేలా మత, సంఘాల నేతలు ప్రోత్సహించాలి'

కొవిడ్​-19 టీకాపై అపోహలను, సందేహాలను నివృత్తి చేస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్​ తీసుకునేలా ప్రోత్సహించాలని వివిధ మత, సంఘాల నాయకులను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో కొవిడ్​ పరిస్థితులపై వారితో వర్చువల్​గా సమావేశమయ్యారు. కరోనా కట్టడిలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు.

PM Modi
ప్రధానమంత్రి, నరేంద్ర మోదీ

By

Published : Jul 28, 2021, 10:39 PM IST

దేశంలో కొవిడ్​ పరిస్థితులపై చర్చించేందుకు మత, సామాజిక సంస్థల ప్రతినిధులతో వర్చువల్​గా సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. టీకాలపై అవగాహన కల్పిస్తూ.. వ్యాక్సిన్​పై ఉన్న సంకోచాన్ని తొలగించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు. అలాగే.. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. 'యునైట్​ ఇండియా మూవ్​మెంట్'​ ద్వారా యావత్​ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. 'ఏక్​ భారత్​, శ్రేష్ఠ భారత్​' నినాదంతో నిజమైన స్ఫూర్తిని ప్రతిఒక్కరికి తెలియజేయాలని కోరారు.

" ఈ చర్చలు భారత్​ ఒకే సమాజం అనటానికి మరో ఉదాహరణ. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం అందరిని కలుపుకొని పని చేస్తోంది. మతాలు, ప్రాంతాల హద్దులను చెరిపేసి కొవిడ్​ సమయంలో ఇతరులకు సాయం చేయటం ఏక్​ భారత్​-ఏక్ ​నిష్ఠా ప్రయాస్​కు ఉదాహరణ. దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలు ఆసుపత్రులు, ఐసోలేషన్​ కేంద్రాలుగా మారాయి. అవసరమైన వారికి ఔషధాలు, ఆహార పదార్థాలను అందించాయి. ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ అనే ప్రచారం కొవిడ్​ నుంచి రక్షణగా నిలుస్తోంది. వ్యాక్సినేషన్​పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ప్రయత్నాల్లో మత, సంఘాల నాయకులు చేతులు కలపాలి. టీకాలపై ఉన్న రూమర్లు, సందేహాలను నివృత్తి చేసే పోరాటంలో సాయం చేయాలి.​ "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

టీకాలపై ప్రజల్లో ఆందోళనలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు మోదీ. ప్రతి ఒక్కరి వద్దకు ఆరోగ్య సిబ్బంది చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సూచించారు. 75వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రతిఒక్కరు ఆజాద్​ కా అమృత్​ మహోత్సవ్​లో పాలుపంచుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా తమతో మాట్లాడినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు నేతలు. కొవిడ్ కట్టడిలో నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. కొవిడ్​ సవాళ్లను ఎదుర్కొనేందుకు వివిధ మతాలు, సామాజిక సంస్థలు చేసిన సేవలను మోదీకి వివరించారు.

ఇదీ చూడండి:'కొవిడ్​ కట్టడిలో సంతృప్తికి స్థానం లేదు'

ABOUT THE AUTHOR

...view details