పెగాసస్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి, ఇక్కడి సంస్థలకు వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడేందుకు పెగాసస్‌ను ఆయుధంగా ప్రభుత్వం వినియోగించిందని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలన్నారు. దిల్లీలో విజయ్ చౌక్ వద్ద విలేకరులతో రాహుల్ మాట్లాడారు.
"ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెగాసస్‌ను ఇజ్రాయెల్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దాన్ని.. భారత్‌కు, ఇక్కడి సంస్థలకు వ్యతిరేక ఆయుధంగా వాడుకున్నారు. రాజకీయాల కోసం దీన్ని వారు ఉపయోగించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోశారు. సుప్రీంకోర్టు సహా అన్ని సంస్థలకు వ్యతిరేకంగా వారు దీన్ని ఉపయోగించారు.
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
తన ఫోన్లు అన్నింటీని ప్రభుత్వం ట్యాప్ చేసిందని రాహుల్ ఆరోపించారు. పెగాసస్‌పై ప్రభుత్వ చర్యలను రాజద్రోహం కంటే మరో పదంతో పోల్చలేమని విమర్శించారు.
'అదే నిజమైతే.. ఫోన్లు అప్పగించాలి'