ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాస్‌కు నాలుగు రోజుల పాటు హాజరైంది. ఈ విషయం యాజమాన్యానికి తెలియకుండా జాగ్రత్త పడింది.
కేరళ మలప్పురం ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. కోజికోడ్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం క్లాస్‌కు నాలుగు రోజుల పాటు వెళ్లింది. అటెండెన్స్ కూడా వేసింది. ఐదో రోజు నుంచి రావడం మానేసింది. ఈ విషయం కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలిసింది. వివరాలు సేకరించగా.. అడ్మిషన్ లిస్టులో ఆమె పేరు లేదు. కానీ అటెండెన్స్ రిజిస్టర్లో ఉంది. ఆ తర్వాత ప్రిన్సిపాల్ కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీస్‌కు ఫిర్యాదు చేశారు.
MBBS కాలేజీకి ఇంటర్ విద్యార్థిని.. 4 రోజులు క్లాసులకు అటెండ్ అయ్యాక.. - ఇంటర్ విద్యార్థిని అత్యుత్సాహం
ఎంబీబీఎస్ క్లాస్‌కు ఓ బాలిక నాలుగు రోజుల పాటు హాజరైంది. ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేసింది. ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిందని అందరికీ మెసేజ్‌లు పెట్టింది. చివరకు ఏమైందంటే..
తనకు ఎంబీబీఎస్ సీటు వచ్చిందని చాలా మందికి ఆ బాలిక వాట్సాప్ మెసేజ్‌లు పంపిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె ఇంకా ఇంటర్ చదువుతోందని.. మెడిసిన్ చదవాలనే కోరికే, బహుశా ఆ బాలిక ఇలా చేయడానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటన జరిగిన తర్వాత.. ఆ బాలిక పేరు, వివరాలు తెలుసుకోవడానికి మెడికల్ కాలేజీ యాజమాన్యం కూడా అంతర్గత విచారణ చేపట్టింది.
ఈ విషయంపై కోజికోడ్ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుజిత్ కుమార్ స్పందించారు. "ఇప్పటివరకు ఇలాంటి ఘటన మా కాలేజీలో జరగలేదు. క్లాస్‌లోకి అనుమతించే ముందు ప్రతి విద్యార్థి అడ్మిట్ కార్డు చెక్ చేస్తాం. అయితే ఒక్కోసారి క్లాస్ ఆలస్యంగా ప్రారంభమైనప్పుడు.. ఏం చెక్ చేయకుండానే క్లాస్‌కు అనుమతిస్తాం. ఈ విషయం తెలిసిన వెంటనే మేము విచారణ చేపట్టాం. అప్పటినుంచి ఆ విద్యార్థిని కనిపించడం లేదు. దీంతో మిగతా విద్యార్థులందరికీ అడ్మిట్ కార్డులు జారీ చేశాం" అని చెప్పారు.