NCM Act challenging plea: జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం-NCMలో నిబంధనను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సెక్షన్ 2C చట్టబద్ధతను సవాల్ చేస్తూ మథురకు చెందిన దేవ్‌కీ నందన్ థాకూర్ అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మైనారిటీ అనే పదాన్ని నిర్వచించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయిలో మైనారిటీలను గుర్తించాలని మార్గదర్శకాలు జారీచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
మైనారిటీ చట్టం నిబంధనలు సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ - NCM Act challenging plea
NCM Act: మైనారిటీ చట్టం సెక్షన్ 2సీ చట్టబద్ధతను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జిల్లాస్థాయిలో మైనారిటీలను గుర్తించాలని మార్గదర్శకాలు జారీచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
1993 అక్టోబర్ 23న మైనారిటీలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను అసంబద్దమైనదిగా, రాజ్యాంగంలోని 14, 15, 21, 29, 30 ఆర్టికల్స్‌కు విరుద్ధమని ప్రకటించాలని ఫిటిషనర్ విజ్ఞప్తి చేశారు. కొన్ని రాష్ట్రాల్లో మైనారీటీలుగా చెబుతున్న ముస్లింలే అత్యధికంగా ఉన్నారని వివరించారు. మరికొన్ని రాష్ట్రాల్లో హిందువులు అత్యల్ప సంఖ్యలో ఉన్నారని, పలు చోట్ల క్రైస్తవులు కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పారు. అందువల్ల మైనారిటీ పదాన్ని నిర్వచించాలని పిటిషన్లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా మైనార్టీలను గుర్తించాలన్నారు.