దేశంలో గత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవగా.. పాజిటివిటీ రేటులో తగ్గుదల కనిపించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కానీ 10 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఇంకా 25 శాతం నమోదవుతోందని స్పష్టం చేసింది. ఏప్రిల్ 22-28 నుంచి మే 6-12 మధ్య కొవిడ్ కేసులను పోల్చితే.. పాజిటివిటీ రేటు తగ్గిన జిల్లాల సంఖ్య 125 నుంచి 338కి పెరిగిందని పేర్కొంది.
అయితే.. 12 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఒక లక్ష దాటిందని అధికారులు తెలిపారు. 24 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగానే ఉందని వెల్లడించారు.