భారత్‌లో ఏడాదికి 850 మిలియన్ల స్పుత్నిక్- వీ కొవిడ్ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని రష్యా రాయబారి ఎన్ కుదేశవ్ తెలిపారు. సింగిల్ డోసు టీకా 'స్పుత్నిక్ లైట్'ను త్వరలోనే భారత్లోకి తీసుకువచ్చే ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు.
"ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్- వీ టీకా సామర్థ్యం అందరికీ తెలుసు. రష్యాలో 2020 అర్ధభాగం నుంచే దీన్ని వినియోగించటం ప్రారంభించాం. కొవిడ్ స్ట్రెయిన్లపై ఈ టీకా సమర్థంగా పని చేస్తుందని రష్యా శాస్త్రవేత్తలు ఇదివరకే స్పష్టం చేశారు."
-ఎన్ కుదేశవ్, రష్యా రాయబారి