Pizza cyber crime in Mumbai: పిజ్జా, డ్రైఫ్రూట్లను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన మహారాష్ట్రకు చెందిన ఓ వృద్ధురాలికి చేదు అనుభవం ఎదురైంది. పిజ్జా ఆర్డర్ చేసే క్రమంలో కొంత డబ్బు కోల్పోయిన ఆమెకు సాయం చేస్తామని సైబర్ నేరగాళ్లు రూ.11 లక్షలకు టోకరా వేశారు. బాధిత మహిళ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
Woman lost lakhs while ordering Pizza
ముంబయిలోని అంధేరీ ప్రాంతంలో నివసిస్తున్న ఆ మహిళ.. గతేడాది జులైలో పిజ్జా ఆర్డర్ చేశారు. డెలివరీకి ఆన్లైన్ పేమెంట్ చేసే క్రమంలో రూ.9,999ను కోల్పోయారు. అక్టోబర్ 29న డ్రైఫ్రూట్స్‌ను ఆర్డర్ చేస్తూ ఆన్లైన్ లావాదేవీలో రూ.1,496ను పోగొట్టుకున్నారు.
Pizza cyber fraud Maharashtra
కోల్పోయిన డబ్బును రికవరీ చేయడం కోసం గూగుల్‌లో లభించిన ఓ ఫోన్ నెంబర్‌ను సంప్రదించారు. అటు నుంచి మాట్లాడిన సైబర్ నేరగాళ్లు.. డబ్బులు రికవరీ చేయాలంటే ఫోన్లో ఓ యాప్‌ను డౌన్లోడ్ చేయాలంటూ మభ్యపెట్టారు. తెలీక యాప్‌ను డౌన్లోడ్ చేసిన ఆ మహిళ.. వారి వలలో చిక్కుకుపోయింది. యాప్ ద్వారా మొబైల్‌పై కేటుగాళ్లు పూర్తి పట్టు సాధించారు. బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను తస్కరించారు.
అనంతరం బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.11.78 లక్షల డబ్బును తమ అకౌంట్లలోకి బదిలీ చేసుకున్నారు. 2021 నవంబర్ 14 నుంచి డిసెంబర్ 1 మధ్య ఈ లావాదేవీలు జరిగాయి.
ఖాతా నుంచి డబ్బులు మాయం కాగానే.. పోలీసులను ఆశ్రయించారు మహిళ. దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆన్లైన్ ఆర్డర్ సమయంలో డబ్బులు కొట్టేసింది ఎవరనే విషయంపైనా విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం.. సిగరెట్లతో కాల్చి...