తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుంగిపోయిన రోడ్డు.. విస్తుపోయిన జనం

నిత్యం రద్దీగా ఉండే దేశ రాజధానిలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోగా వాహనదారులు బిత్తరపోయారు. ఎవరికి ఏమీ కాకపోవడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

iit flyover crack
కుంగిన రోడ్డు

By

Published : Jul 31, 2021, 4:30 PM IST

ఎప్పుడూ రద్దీగా ఉండే దక్షిణ దిల్లీలోని ఓ ప్లైఓవర్‌ కింద రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోయింది. 10 నుంచి 15 ఫీట్ల లోతు భారీ గుంత ఏర్పడింది. ఈ ఘటనను చూసి అటు నుంచి వెళ్తున్న వాహనచోదకులు హడలిపోయారు. ఎవరికీ ఏమీ కాకపోవటం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు.

దిల్లీ రోడ్డుపై అకస్మాత్తుగా ఏర్పడిన గుంత
కుంగిన రోడ్డు

ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పీడబ్ల్యూడీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గుంతపడిన రోడ్డుచుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆ మార్గం మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. పీడబ్ల్యూడీ సిబ్బంది రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టారు. భూగర్భ పైపులైన్‌ లీకేజీ కారణంగానే రోడ్డు కుంగిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

సహాయక చర్యలు చేస్తున్న సిబ్బంది

ఇదీ చదవండి:వరద నీటిలో ఎల్​పీజీ సిలిండర్లు- పేలి ఉంటేనా!

ABOUT THE AUTHOR

...view details