Pilibhit Road Accident: ఉత్తర్‌ప్రదేశ్ పీలీభీత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డీసీఎం అదుపుతప్పి చెట్టును ఢీకొనగా.. 10 మంది యాత్రికులు మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మొత్తం 18 మంది హరిద్వార్‌లో స్నానం చేసి తిరిగివెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఘోర రోడ్డు ప్రమాదాలు.. 18 మంది దుర్మరణం - up latest news
पीलीभीत में भीषण सड़क हादसे में 10 की मौत हो गई. वहीं, 7 लोग घायल हो गए. जिनमें 2 की हालत गंभीर बनी हुई है.
08:12 June 23
ఘోర రోడ్డు ప్రమాదాలు.. 18 మంది దుర్మరణం
అంతకుముందు బుధవారం సాయంత్రం.. యూపీలోనే హమీర్‌పుర్‌లో జరిగిన ఓ ప్రమాదంలో 8 మంది మృతిచెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. మౌదహా మాక్రావాన్లోని జాతీయ రహదారి-34 వద్ద ఈ విషాదం జరిగింది. మామిడి పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు ఆటోను ఢీకొట్టింది. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:సోదరిని కత్తితో ఏడుసార్లు పొడిచిన సోదరుడు.. వీడియో వైరల్