కరోనా మూడోదశ వ్యాప్తి అనివార్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) హెచ్చరించింది. సామూహిక కార్యక్రమాల సందర్భంగా కొవిడ్ నిబంధనల విషయంలో ప్రజలు, ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరించటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలే కరోనా మూడోదశ వ్యాప్తికి బలమైన కారకాలని ఐఎంఏ అభిప్రాయపడింది.
"పర్యటక స్థలాల సందర్శన, తీర్థయాత్రలు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనటం అవసరమే అయినప్పటికీ.. మరికొన్ని నెలలు ఆగాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు, మహమ్మారుల చరిత్ర ప్రకారం కరోనా మూడోదశ తప్పకుండా వస్తుంది. మూడోదశ వ్యాప్తికి సమయం ఆసన్నమైంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి."
-ఐఎంఏ