తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశమంతా ఒకే టీకా విధానంపై సుప్రీంలో పిల్

దేశవ్యాప్తంగా ఓకే టీకా విధానం ఉండేలా చూడాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఆర్టికల్ 21 ప్రకారం దేశంలోని ప్రతి పౌరునికి టీకా ఉచితంగా పొందే హక్కు ఉందని పిటిషనర్​ పేర్కొన్నారు.

Supreme Court, SC
సుప్రీంకోర్టు, సుప్రీం

By

Published : May 12, 2021, 3:23 PM IST

టీకా విధానాన్ని దేశవ్యాప్తంగా ఒకేలా రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశంలోని ప్రతి పౌరునికి వ్యాక్సిన్​ను ఉచితంగా అందించాలంటూ అడ్వకేట్ సెల్విన్ రాజా ద్వారా సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్​ ఇండియా ఈ పిల్ దాఖలు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉచితంగా టీకా ఇవ్వాలని.. పర్యవేక్షణ కోసం సుప్రీం ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఆర్టికల్​ 21 ప్రకారం టీకాను ఉచితంగా పొందడం దేశంలోని ప్రతి పౌరుని హక్కు అని సోషల్ డెమొక్రటిక్​ పార్టీ పిల్​లో తెలిపింది.

"దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతన్నందున సరైన చికిత్స అందక ప్రజలు చనిపోతున్నారు. శ్మశానాలు రాత్రింబవళ్లు ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. అంత్యక్రియల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దేశంలోని ప్రజలందరూ టీకాపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఖరారు చేసిన టీకాల ధరలు మెజారిటీ ప్రజలకు భారంగా మారాయి" అని పిటిషనర్​ పేర్కొన్నారు.

దేశంలోని పేదలు సహా మెజారిటీ ప్రజలకు ఉచితంగా టీకా అందిస్తే హెర్డ్​ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని పిల్​ అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: 'భారత్​లో ఉత్పరివర్తనం చెందిన కరోనా.. 44దేశాల్లో'

ABOUT THE AUTHOR

...view details