రెమ్డెసివిర్ ఔషధాలను ఉత్పత్తి చేసే అన్ని సంస్థలను దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై అభిప్రాయం తెలియజేయాలని కేంద్రాన్ని, వివిధ ఫార్మా సంస్థలను దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
'రెమ్డెసివిర్ అమ్మకాల్లో ఆ సంస్థల మాటేమిటి?' - దిల్లీ హైకోర్టు
దేశంలో రెమ్డెసివిర్ ఔషధాన్ని ఉత్పత్తి చేసే అన్ని సంస్థలను దేశీయ మార్కెట్లు విక్రయించేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
!['రెమ్డెసివిర్ అమ్మకాల్లో ఆ సంస్థల మాటేమిటి?' Remdesivir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11626008-thumbnail-3x2-11.jpg)
రెమ్డెసివిర్ ఔషధ ఎగమతులపై కేంద్రం నిషేధం విధించినప్పటికీ.. 6 నుంచి 8 సంస్థలు మాత్రమే దేశీయ మార్కెట్లో తమ ఉత్పత్తులను విక్రయించేందుకు అనుమతించారని.. పిటిషనర్ దిన్కర్ బజాజ్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. మరో 25కుపైగా సంస్థలు.. విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సహా వివిధ ఫార్మా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి:'టీకాలు కొనట్లేదనే వార్తలన్నీ అవాస్తవాలు'