తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'క్రిమినల్' నేతలకు చెక్.. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం?.. కేంద్రానికి నోటీసులు - క్రిమినల్ నేతలు డిబార్

క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను ఎన్నికల్లో పోటీ చేయనీయరాదంటూ దాఖలైన పిటిషన్​పై కేంద్రానికి నోటీసులు పంపింది సుప్రీంకోర్టు. దీనిపై స్పందించాలని ఎన్నికల సంఘాన్ని సైతం ఆదేశించింది.

supreme court news
supreme court news

By

Published : Sep 28, 2022, 4:31 PM IST

తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర న్యాయ, హోంశాఖలకు నోటీసులు పంపింది.

భాజపా నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తీవ్రమైన క్రిమినల్ నేరాలు ఎదుర్కొంటున్న నేతలు పోటీలో పాల్గొనకుండా డిబార్ చేయాలని వ్యాజ్యంలో కోరారు. దీనిపై కేంద్రం, ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ రిషికేశ్ రాయ్​తో కూడిన బెంచ్ విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే నోటీసులు పంపింది.

ABOUT THE AUTHOR

...view details