దురుద్దేశంతో, ముందస్తు ప్రణాళిక ప్రకారమే కొత్త పార్లమెంట్(సెంట్రల్ విస్టా) నిర్మాణం ఆపాలని పిటిషన్లు వేశారని దిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో పాటు దిల్లీలో మెట్రోనూ కొన్ని ఏజెన్సీలు నిర్మిస్తున్నా.. వాటి గురించి పట్టించుకోకుండా కేవలం సెంట్రల్ విస్టాను ఆపాలనే దురుద్దేశంతో పిటిషన్లు వేశారని ప్రభుత్వం పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది.
పని ప్రదేశంలో కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలిపింది కేంద్రం. థర్మల్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నామని వివరించింది. దీనిపై విచారణను కోర్టు మే12కు వాయిదా వేసింది.