తెలంగాణ

telangana

By

Published : Jun 10, 2021, 10:23 AM IST

ETV Bharat / bharat

Viral: 'ఆలూ చిప్స్​'తో కర్రీ- ఇదేం వెరైటీ?

వంటలపై ఇష్టంతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు భోజనప్రియులు. వాటిల్లో కొన్ని బెడిసికొడతాయి. తాజాగా.. 'ఆలూ చిప్స్​ కర్రీ' ఈ జాబితాలో చేరింది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 'అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది రా బాబు' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Potato Chips Curry go vira
ఆలు చిప్స్​తో కర్రీ

గరిట తిప్పడంపై మక్కువ ఉన్న వాళ్లు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొన్నిసారు అవి క్లిక్​ అవుతాయి, మరికొన్ని సార్లు బెడిసికొడతాయి. అయితే కొన్నిసార్లు ఆ ప్రయోగాలను చూస్తే.. 'అసలు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందిరా బాబు..' అనుకునే సందర్భాలూ ఉంటాయి. నెట్టింట్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. 'ఆలూ చిప్స్​ కర్రీ'ని చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు.

ఏంటిది...?

కోల్​కతా ఫుడ్​ ట్రోటర్స్​ అనే ఫేస్​బుక్​ గ్రూప్​లో ఈ ఆలూ చిప్స్​ కర్రీ ఫొటోను పెట్టారు. ఆలూ చిప్స్​, టమాటా గ్రేవీ, పచ్చిమిర్చితో ఈ కర్రీ ఉంది. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. ఆలు అంటే చాలా మందికి ఇష్టమే. ఆలూ చిప్స్​ అంటే కొందరిలో పిచ్చి కూడా ఉంటుంది. అలాంటిది దానిని కర్రీ రూపంలో చూసేసరికి విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 'ఇది కచ్చితంగా హత్యా ప్రయత్నమే. ఇందుకు కనీసం 14 సంవత్సరాల జైలు శిక్ష వెయ్యాలి' అని ఒకరు కామెంట్​ చేయగా.. 'మానవత్వం ప్రమాదంలో ఉంది' అని ఇంకొకరు ట్వీట్​ చేశారు. 'ఆలూ చిప్స్​ చాలా బాగుంటాయి.. కానీ వాటితో కర్రీ చేయడం ఏంటి?' అని ఓ నెటిజన్​ అభిప్రాయపడ్డాడు.

ఇవీ చదవండి:'పాప్​కార్న్​ సలాడ్'.. ఇదేం ఐడియా తల్లీ!

ABOUT THE AUTHOR

...view details