ఆన్లైన్ క్లాసు మధ్యలో పేలిన ఫోన్ Phone Blast: మధ్యప్రదేశ్ సత్నా జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఆన్లైన్ క్లాసులు జరుగుతుండగా ఫోన్ పేలి.. ఓ 15 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
అసలేం జరిగిందంటే..?
చంద్ కుయియా గ్రామానికి చెందిన రామ్‌ప్రకాశ్ భదౌరియా 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం అతడు ఫోన్లో ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా అతడి చేతిలోని ఫోన్ పేలింది. దీంతో అతని దవడకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని నగోడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్పీ మిశ్రా తెలిపారు.
గాయపడ్జ రామ్‌ప్రకాశ్ భదౌరియా "ఘటనా సమయంలో ఇంట్లో రామ్‌ప్రకాశ్ ఒక్కడే ఉన్నాడు. అతని కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఫోన్ పేలడం వల్ల.. భారీ శబ్దం వినిపించగా చుట్టుపక్కల వారు రామ్‌ప్రకాశ్ వద్దకు చేరుకున్నారు. స్థానికులు అతడిని సత్నా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జబల్‌పుర్‌కు తరలించారు" అని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.
ఇదీ చూడండి:CCTV Video: దొంగల బీభత్సం.. మహిళ ఫోన్ కొట్టేసి.. స్కూటీపై వేగంగా ఈడ్చుకెళ్లి..
ఇదీ చూడండి:భార్య నిత్యలక్ష్మి.. భర్త 'నిత్య' పెళ్లి కొడుకు!