దేశంలో ఇంధన ధరలు అంతకంతకూ పెరగడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ ధర రూ. 100 దాటడంపై ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
"ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నుల కంటే పెట్రోల్, డీజిల్ పైనే కేంద్ర ఖజానాకు అధిక ఆదాయం తరలింది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయటంలో కేంద్రం పీహెచ్డీ చేసింది."