తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడో దశ: 11 రాష్ట్రాల్లో 86 వేల మందికి టీకా - రాష్ట్రాలకు అందుబాటులో వ్యాక్సిన్​లు

మూడో దశ టీకా పంపిణీ కార్యక్రమంలో తొలి రోజే దేశవ్యాప్తంగా 86వేల మందికి పైగా వ్యాక్సిన్​ తీసుకున్నారు. ఈ క్రతువులో 11 రాష్ట్రాలు భాగమైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

vaccination, Phase-3
మూడోదశ: 11 రాష్ట్రాల్లో 86 లక్షల మందికి టీకా

By

Published : May 2, 2021, 2:32 PM IST

శనివారం 18-45 ఏళ్ల మధ్య వారి కోసం ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్‌ మూడో దశ ప్రక్రియలో తొలి రోజు దేశవ్యాప్తంగా 86వేల మందికి పైగా టీకా అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా 11 రాష్ట్రాలు ఇందులో భాగమైనట్లు వివరించింది. ఇప్పటివరకు మూడు దశల్లో 15 కోట్ల 68 లక్షల మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఆరోగ్య కార్యకర్తల్లో 94లక్షల 28వేల మంది తొలి డోసును, 62లక్షల 65వేల మంది రెండో డోసును తీసుకున్నట్లు వివరించింది. ఫ్రంట్‌లైన్‌ సిబ్బందిలో ఒక కోటి 27లక్షల మంది తొలి డోసు, 69లక్షల 22వేల మంది రెండో డోసు తీసుకున్నట్లు తెలిపింది. 60 ఏళ్ల పైబడిన వారిలో 5కోట్ల 26 మంది తొలి డోసు, కోటి 14లక్షల మంది రెండో డోసును తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

అందుబాటులో 78 లక్షల టీకాలు..

రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు 78 లక్షల కరోనా వ్యాక్సిన్​లు అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మూడు రోజుల్లో మరో 56 లక్షల డోసులు అదనంగా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇప్పటికే కేంద్రం 16.54 కోట్ల వ్యాక్సిన్​లను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా ఇచ్చింది. అయితే వాటిలో ఇప్పటివరకు 15 కోట్ల 76 లక్షల డోసులను వినియోగించుకున్నాయి.

ఇవీ చూడండి:

దేశంలో మరో 3.92 లక్షల కరోనా కేసులు

కొవిడ్ టెస్టుకు వెళ్లి.. విగతజీవిగా మారి

ABOUT THE AUTHOR

...view details